Jun 23,2021 16:33

మండపేట (తూర్పు గోదావరి) : భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మండల అభివృద్ధి అధికారి ఐదం రాజు అన్నారు. భవన నిర్మాణ పక్షోత్సవాలు కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఇప్పనపాడు గ్రామంలోని నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 13 గ్రామ పంచాయతీలలోను 63 భవనాలు నిర్మించాల్సి ఉండగా.. ప్రస్తుతం 4 రైతు భరోసా కేంద్రాలు, 17 సచివాలయాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. వైయస్సార్‌ క్లినిక్‌ నిర్మాణ పనులు చేపట్టలేదన్నారు. నిర్మాణ పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరగదని, కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణ పనులు పూర్తిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్‌ కుంచెం ప్రసాద్‌, జెఈ నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి వర్మ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.