May 17,2022 22:16

మాట్లాడుతున్న ఐసిడిఎస్‌ పీడీ వరహాలు
ప్రజాశక్తి-పాచిపెంట : అంగన్వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఐసిడిఎస్‌ పీడీ జి.వరహాలు.. సూపర్‌వైజర్లను ఆదేశించారు. మంగళవారం మండలంలోని పిండ్రంగివలస అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కేంద్రం పనితీరుపై సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం పాచిపెంట ఐసిడిఎస్‌ కార్యాలయంలో అంగన్వాడీ సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. మన్యం జిల్లాలో ఐసిడిఎస్‌ పనితీరు సంతృప్తిగా ఉందన్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు పాల కొరత ఉందని, ఎపి డెయిరీ నుండి కేంద్రాలకు రావాల్సిన దానికంటే తక్కువ పాలు సరఫరా అవుతున్నాయని, దీంతో కేంద్రాల్లో పాల కొరత ఏర్పడిందని తెలిపారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సులు నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో సిడిపిఒ ఎస్తేరు రాణి, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.