
ప్రజాశక్తి-బాపట్ల: తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం బాధ్యులు వేగేశన నరేంద్రవర్మ బాపట్లలో ప్రారంభించిన అన్న క్యాంటీన్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం బాపట్ల మండలం జమ్ములపాలెం గ్రామానికి చెందిన కాపు అంకమ్మ చౌదరి, ఆయన సతీమణి ఇందిర 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్న క్యాంటీన్‌లో 350 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారానికి అన్న క్యాంటీన్ 208వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్ నిర్వహకులు వేగేశన నరేంద్రవర్మ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిరుపేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే వైసిపి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందన్నారు. బాపట్ల ప్రాంతంలో నిరుపేదలకు ఉచితంగా అన్నదానం చేయాలని లక్ష్యంతో ఇక్కడ ప్రారంభించిన అన్న క్యాంటీన్‌కు దాతల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. వారికి ప్రత్యేకంగా కతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు ఇనగంటి గాంధీ, అప్పసాని మహేంద్ర, ఊట్ల రామారావు, బండి సుబ్బారామయ్య, శ్రీనివాసరావు, కరణం విఘ్నేశ్వరరావు, టిడిపి నాయకులు కార్యకర్తలు దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.