Jun 24,2022 01:48

ప్రజాశక్తి-అద్దంకి: ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం నిత్యాన్నదాన భవన ప్రారంభ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి, వైసీపీ నాయకులు శిద్దా రాఘవరావు దంపతులు, వారి కుమారులు శిద్దా సుధీర్‌ కుమార్‌ దంపతులు, అల్లుడు మన్యం ఫణికుమార్‌ దంపతులు కుటుంబ సభ్యులు, అద్దంకి వైసీపీ ఇన్‌ఛార్జి, శ్యాప్‌ నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణ చైతన్య, శింగర కొండ ఆలయ చైర్మన్‌ కోట శ్రీనివాసకుమార్‌ కలిసి నిత్యాన్నదాన భవనం శిలా ఫలకం ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నూతన భవన గృహ ప్రవేశ వేడుకలు నిర్వహించారు. అనంతరం మాజీమంత్రి, వైసీపీ నాయకులు శిద్దా రాఘవరావు సొంత నిధులు రూ.25 లక్షలతో నూతనంగా నిర్మించిన నిత్యాన్నదాన భవనం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దంపతులు, శిద్దా సుధీర్‌ కుమార్‌, మన్యం ఫణికుమార్‌ దంపతులు వేద పండితులు నేలబొట్ల రామకృష్ణ శాస్త్రి, సుబ్రహ్మణ్యం శర్మ ఆధ్వర్యంలో గో పూజ, వాస్తు హోమం, గణపతి పూజ, మండపారాధన, నవగ్రహ మండపారాధన, పుణ్యహవచనం, గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు శిద్దా రాఘవరావు దంపతులకు, వైసీపీ ఇన్‌ఛార్జి బాచిన కృష్ణ చైతన్య, శిద్దా సుధీర్‌ కుమార్‌ దంపతులు, మన్యం ఫణికుమార్‌ దంపతులకు వేద ఆశీర్వదాలు నిర్వహించారు. ముందుగా శిద్దా రాఘవరావు దంపతులు, శిద్దా సుధీర్‌ కుమార్‌ దంపతులు, మన్యం ఫణికుమార్‌ దంపతులను శింగరకొండ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్‌ కోట శ్రీనివాస కుమార్‌, ఇఓ శ్యామల రఘునాథరెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శిద్దా దంపతులు కుటుంబ సభ్యులతో కలసి ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మించిన నిత్యాన్నదాన భవనంలో భక్తులకు అన్నదానం, అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, శిద్దా వెంకటేశ్వర్లు, శింగర కొండ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్‌ కోట శ్రీనివాస కుమార్‌, ఆలయ కార్య నిర్వాహక అధికారి శ్యామల రఘునాథరెడ్డి, జ్యోతి గ్రానైట్‌ ఎక్స్‌పోర్ట్‌ ఇండియా సిఓఓ ఎమ్‌ శివరామ్‌, బొమ్మిశెట్టి కిరణ్‌, ఉప్పుటూరి కష్ణ, రావిపూడి లక్ష్మీనారాయణ, శిద్దా కాశీ, ఆలయ ప్రధాన అర్చకులు అన్నవరపు వెంకట సత్యనారాయణ అవధాని, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు అన్నా బత్తిన సీతా రామయ్య, జ్యోతి చంద్రమౌళి, పబ్బిశెట్టి శ్రీనివాసరావు, రమాదేవి హనుమంత రావు, పూల రాము, కోట లక్ష్మీనారాయణ, రజని రాఘవరెడ్డి, రమణమ్మ అంజయ్య, సరస్వతి రామారావు, ఆర్యవైశ్య నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
నిత్యాన్నదాన భవనాన్ని ప్రారంభిస్తున్న మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు