Jul 29,2021 23:22

ప్రజాశక్తి-అద్దంకి: మండలంలోని తిమ్మాయపాలెంలో కోవిడ్‌-19 రిలీఫ్‌ ప్రోగ్రాం ద్వారా పాస్టర్‌ లంకా కరుణాకర్‌ ఆధ్వర్యంలో పాస్టర్లకు నిత్యావసర సరుకులను ఎపి శాప్‌నెట్‌ చైర్మన్‌, అద్దంకి వైసిపి ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ జ్యోతి హనుమంతరావు, గ్రామ నాయకులు గంగినేని సుబ్బారావు, మన్నం శ్రీను పాల్గొన్నారు.