Aug 18,2022 22:26

శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌

ప్రజాశక్తి- జి.సిగడాం: ఎచ్చెర్ల నియోజకర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని బాతువ పంచాయతీలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు కింద రూ.1.28 కోట్లతో అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. అలాగే జి.సిగడాం పంచాయతీలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పంచాయతీలోనూ ఒక సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మిస్తామని తెలిపారు. అలాగే నిర్మాణంలో ఉన్న భవనాలను త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. కార్యక్రమంలో కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌, నియోజకవర్గం ప్రత్యేక పరిశీలకులు అంధవరపు సూరిబాబు, ఎంపిపి మీసాల సత్యవతి, జెడ్‌పిటిసి కాయల రమణ, మండల కన్వీనర్‌ మీసాల వెంకటరమణ, బిసి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ప్రతినిధి మామిడి బలరాం, డిసిఎంఎస్‌ డైరెక్టర్‌ నక్క ప్రసాద్‌, సి.సిగడాం, బాతువ పిఎసిఎస్‌ అధ్యక్షులు ఎర్నేని ప్రకాష్‌, పల్లాడ సన్యాసిరావు, బాతువ ఎంపిటిసి ప్రతినిధి బూటు అప్పారావు, జి.సిగడాం సర్పంచ్‌ ముద్దాడ ఈశ్వరమ్మ, ఎంపిడిఒ శ్రీనివాసరావు, డిటి నిర్మల, పంచాయతీరాజ్‌ డిఇ సీతంనాయుడు, ఎఇ శ్రీవల్లి, ఎంఇఒ రవి, విద్యుత్‌శాఖ ఎఇ తిరుపతిరావు పాల్గొన్నారు.