
రవితేజ ఇటీవల 'క్రాక్' సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' చిత్రంలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్, గ్లింప్స్ వీడియోలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. మే 28న ఈ సినిమా విడుదల కానుంది. రవితేజ తాజాగా మరో సినిమాను ప్రకటించాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ 68వ సినిమా అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టిజి విశ్వప్రసాద్, అభిషేక్, వివేక్ కూచిభోట్ల నిర్మించనున్నారు. కుమార్ బెజవాడ దీనికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.