Jan 13,2021 18:46

'నల్లమల' సినిమా వీడియో సాంగ్‌ను సీనియర్‌ నటుడు నాజర్‌ విడుదల చేశారు. నల్లమల చుట్టూ ఉన్న ఎన్నో చీకటి కోణాలను స్పృశిస్తూ.. అక్కడి వారి జీవితాలను ప్రభావితం చేస్తున్న అనేకమంది మోసాలను బట్టబయలు చేస్తూ తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇప్పటివరకు ఇలాంటి కథాంశంతో తెలుగులో సినిమా రాలేదనే చెప్పాలి. కథే హీరోగా రూపొందుతున్న 'నల్లమల' సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా నాజర్‌ అన్నారు.