Jul 29,2021 23:32

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఐజి

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : మండలంలోని నందిగామ గ్రామాన్ని గుంటూరు రేంజ్‌ ఐజి త్రివిక్రమ్‌వర్మ, రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. దిశయాప్‌ గురించి మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం సచివాలయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో డిఎస్‌పి విజయభాస్కరరెడ్డి, రూరల్‌ సిఐ నరశింహరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - తాడికొండ: మండలంలోని నిడుముక్కలలో హెల్ప్‌ పాండేషన్‌ ఆధ్వర్యంలో కరోనా, దిశ యాప్‌, బాల్య వివాహాలపై అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ కళావతి పలు అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా దిశ యాప్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.