Nov 26,2021 11:05

ప్రజాశక్తి-నందిగామ (కృష్ణా) : అన్ని పంటలకు సి 2 ప్లస్‌ 50 శాతం మద్దతు ధర గ్యారెంటీ చట్టం తేవాలని, ఎఫ్‌ఇఐ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ... ఎపి రైతు సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఉదయం నందిగామ గాంధీ సెంటర్‌ లో రైతు సంఘాల నాయకులు సామూహిక నిరసనలను నిర్వహించారు. కౌలు రైతు సంఘం నాయకులు చనుమోలు సైదులు, రైతు సంఘం నాయకులు చుండూరు సుబ్బారావు మాట్లాడుతూ... రైతు వ్యతిరేక చట్టాలు, నల్ల చట్టాలు, విద్యుత్‌ బిల్లులను పూర్తిగా రద్దు చేసేంతవరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కటారపు గోపాల్‌, యర్రా శ్రీనివాసరావు, పాలేటి పూర్ణయ్య, సయ్యద్‌ ఖాసిం, కర్రి వెంకటేశ్వరరావు, గోపినాయక్‌, దామోదర్‌, జక్కలూరి రవి, శ్రీనివాసరావు, వడ్డెల్లిసాంబశివరావు, సర్జనరావు, తదితరులు పాల్గొన్నారు.