Nov 29,2021 23:28

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: సిఐటియు రాష్ట్ర మాజీ కార్యదర్శి నండూరి ప్రసాదరావుకి సిఐటియు జిల్లా కమిటీ నాయకులు ఘన నివాళులర్పించారు. స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో నండూరి ప్రసాదరావు చిత్రపటానికి సిఐటియు జిల్లా కార్యదర్శులు గంటెనపల్లి శ్రీనివాసులు, కాలం సుబ్బారావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒంగోలులో నండూరి ప్రసాదరావు పేరుతో సిఐటియు జిల్లా కార్యాలయం నిర్మాణం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో శ్రామిక మహిళా కన్వీనర్‌ పి.కల్పన, జిల్లా కోశాధికారి పి.శ్రీనివాసరావు, నగర కార్యదర్శి టి.మహేష్‌, జి.రమేస్‌, తంబి శ్రీనివాసులు, చాపల రమాదేవి, కంకణాల రమాదేవి, ఎస్‌కె హుస్సేన్‌, అత్తింటి శ్రీనివాసులు, పోకల ప్రసాద్‌, పోకల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.