Apr 07,2021 21:34

న్యూఢిల్లీ బ్యూరో : 'నన్ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారు' అని వైసిపి ఎంపి రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆ లేఖను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజరు భల్లాకు అందజేశారు. జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌ వేసినందుకు తనకు చాలా మంది ఫోన్‌ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని అన్నారు. తన కోసం కడప బ్యాచ్‌ను దించాలనుకుంటున్నారని పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపి విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలంటూ సిబిఐ డైరెక్టరుకు లేఖ రాసినట్లు రఘురామ కృష్ణంరాజు చెప్పారు.