Oct 12,2021 20:48

నేడు క్వాలిఫయ-2 ఢిల్లీతో పోటీ
రా.7.30గం||ల నుంచి

షార్జా: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)పై అద్భుత విజయం సాధించిన కోల్‌కతా నైట్‌రైడర్స జట్టు బుధవారం ఢిల్లీతో పోటీకి సిద్ధమైంది. సోమవారం జరిగిన ఎలిమినేటర్‌-1 మ్యాచ్‌లో కోల్‌కతా 4 వికెట్ల తేడాతో ఆర్సీబీపై విజయం సాధించి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా మరో రెండు బంతులు మిగిలి ఉండగా విజయం సాధించింది. భారత్‌ వేదికపై కోల్‌కతా 5 మ్యాచుల్లో ఓడి, కేవలం 2 మ్యాచుల్లో గెలిచింది. కానీ యుఏఇ వేదికపై కోల్‌కతా 5 మ్యాచులు గెలిచి కేవలం 2 మ్యాచుల్లో మాత్రమే పరాజయం పాలైంది. యుఏఇ వేదికపై ఢిల్లీని ఓడించగా.. భారత్‌లో మాత్రం ఆ జట్టు చేతిలో ఓడింది. దీంతో నిర్ణయాత్మక పోటీలో ఇరుజట్లు గెలుపే థ్యేయంగా బరిలోకి దిగనున్నాయి. దుబారు పిచ్‌పై ఢిల్లీ 4 వికెట్ల తేడాతో చెన్నై చేతిలో చిత్తు కాగా.. షార్జా పిచ్‌పై కోల్‌కతా జట్టు 4 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తుచేసిన సంగతి తెలిసిందే.