Oct 03,2022 23:03

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి, తిరుపతి ఎంపి

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి
ప్రజాశక్తి- తిరుపతి సిటి :
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రూ.1453 కోట్లు చెల్లించడానికి కేంద్ర పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సానుకూలంగా స్పందించారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి బుడి ముత్యాలనాయుడు తెలిపారు. కేంద్ర మంత్రి తిరుపతి, తిరుమల పర్యటనలో భాగంగా సోమవారం తిరుపతి పద్మావతి అతిథిగృహంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎంపిలు డాక్టరు గురుమూర్తి, రెడ్డెప్ప, సత్యవతి, జాయింట్‌ కలెక్టరు డికె.బాలాజీ, రాష్ట్ర డైరెక్టర్‌ చిన్న తాతయ్య, జిల్లా అధికారులు కేంద్రమంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఈసందర్భంగా ఉపముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ కేంద్రమంత్రిని కలిసి రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను వివరించామని, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను, కేంద్ర అనుసంధాన పథకాలలో పేదలకు కొన్ని వెసులుబాటు కోసం మంత్రికి వినతిపత్రం అందజేశామని తెలిపారు. పండ్ల తోటల రైతులకు ఇప్పటి వరకు 5 ఎకరాల వరకే వెసులుబాటు ఉందని, 10 ఎకరాలు ఉన్న వారిని పెద్ద రైతులుగా గుర్తించేవారని, పంటలు సక్రమంగా పండక పేద రైతులుగానే ఉన్నారని, 10 ఎకరాలు పైబడిన వారిని పెద్ద రైతులుగా గుర్తించాలని మంత్రిని కోరామన్నారు. గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ తోటలకు కూడా ఉపాధి హామీ పనులను అనుసంధాంన చేయాలని, అప్పడే గిరిజనులకు మేలు కులుగుతుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద గృహనిర్మాణాలకు ఇస్నుత్న 90 రోజుల పని దినానలు 100 రోజులు పనిదినాలతో కలపకుండా అదనంగా ఉపాధి కల్పించాలని కోరామన్నారు. ఎస్‌టిలలో అత్యంత వెనుకబడిన వారు చెంచు జాతులని, వారికి ఉపాధి హామీ పనులు 200రోజులు వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన పేస్‌-1 కింద పనులను రానున్న మార్చి వరకు పొడిగించాలని, దాదాపు 624 కిలోమీటర్లు రోడ్డు వేయాల్సి ఉందని సూచించామని వెల్లడించారు. పేస్‌-3 కింత 970 కిలోమీటర్లు 76 బ్రిడ్జిల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపామని మంజురు చేయాలని కోరారు. నేషనల్‌ రూర్బన్‌ మిషన్‌ కింద రూ.48కోట్లు వెనక్కు తీసుకోవడంతో రూ.145కోట్లు చెల్లింపులు ఆగాయని, త్వరగా మంజూరు చేయాలని కోరామన్నారు. దీన దయాల్‌ అంత్య యోజన- జాతీయ గ్రామీణ ఉపాధుల మిషన్‌ శిక్షణ ఇచ్చే ఏజెన్సీలలకు రూ.5.81 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని, వెంటనే విడుదల చేయాలని, పేదలకు అందించే ఈ శిక్షణలు ఎంతో అవసరమని తెలియజేశామన్నారు. వీటిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.