Aug 18,2022 23:23

గెలుపొందిన జట్టు క్రీడాకారులు

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌: ప్రముఖ వ్యాపారవేత్త వెలగా నారాయణరావు కుమారుడు సుధీర్‌ పుట్టినరోజు సందర్భంగా నర్సీపట్నం ఎన్టీఆర్‌ స్టేడియంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 14 టీంలు పాల్గొన్నాయి. సిద్ధి వినాయక హనుమాన్‌ టీం మొదటి బహుమతి, బాలయోగి గురుకులం అమ్మాయిలు సెకండ్‌, స్థానిక డిఎంకె జూనియర్‌ కాలేజీ విద్యార్థినిలు మూడు స్థానం సాధించారు. విజేతలకు ఏఎస్పీ మణికంఠ చందోల్‌ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఇటువంటి క్రీడా కార్యక్రమాలు జరగడం చాలా ఆనందదాయకమన్నారు. అనంతరం వెలగా నారాయణరావు దంపతులు కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీసిద్ధి వినాయక హనుమాన్‌ కోచ్‌ మధు పాల్గొన్నారు.