
బెంగళూరు : నటుడు నరేష్-పవిత్ర-రమ్య వివాదం ముదిరింది. మా మధ్య ఏమీ లేదని చెబుతున్న నరేష్-పవిత్రను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు మైసూర్లో వారు స్టే చేస్తున్న హోటల్‌కు మీడియాతో సహా చేరుకున్నారు రమ్య. వారిద్దరు హోటల్ రూము నుండి బయటకు రాగా.. పవిత్రను చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. కాగా, నరేష్ మాత్రం చాలా ఈజీగా తీసుకుంటూ.. విజిల్ వేసుకుంటూ వెళ్లిపోయారు. అనంతరం రమ్య మాట్లాడుతూ... స్నేహితులమని చెప్పుకుంటున్న వారూ రాత్రంతా ఒకే హోటల్ రూమ్‌లో ఉన్నారని అన్నారు. భార్యాభర్తలు అన్నాక గొడవలుంటాయని, తాను విడాకులు ఇవ్వబోయేది లేదని తెలిపారు. నరేష్, మూడో భార్య రమ్య రఘుపతి కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. అయితే ఇటీవల కాలంలో నటి పవిత్రా లోకేష్‌తో సన్నిహితంగా మెలగడంతో పాటు పెళ్లి చేసుకున్నారన్న వార్తలు వచ్చాయి. దీంతో తనకు విడాకులివ్వకుండా ఆమెను ఎలా పెళ్లి చేసుకుంటారని రమ్య వరుస ప్రెస్మీట్లు పెట్టిన సంగతి తెలిసిందే.
</p>