Aug 09,2022 20:49

క్యూ1లో బహుళ రెట్ల వృద్థి
హైదరాబాద్‌ : 
ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ నాట్కో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో బహుళ రెట్ల వృద్థితో రూ.320.4 కోట్ల నికర లాభాలు సాధించింది.  గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.75 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ రూ.410 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ1లో రూ.884.6 కోట్లకు చేరింది. ''గడిచిన త్రైమాసికంలో లెనలిడొమైడ్‌ ఉత్పత్తులను అమెరికా సహా ప్రధా దేశాలకు ఎగుమతులు చేయడం ద్వారా వ్యాపార లాభదాయకతలో పెరుగుదల చోటు చేసుకుంది.'' అని నాట్కో పేర్కొంది. 2022 జూన్‌30తో ముగిసిన త్రైమాసికంలో స్వచ్ఛంద పదవీ విరమణ కింద ఉద్యోగులకు రూ.29.1 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. 2022-23కు గాను మధ్యంతర డివిడెండ్‌ కింద రూ.2 ప్రతీ ముఖ విలువ కలిగిన షేర్‌పై రూ.3.50 డివిడెండ్‌ అందించడానికి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు.