Oct 03,2022 14:48

న్యూఢిల్లీ :   కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డి.కె. శివకుమార్‌కి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) మరోసారి సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేషనల్‌ హెరాల్డ్‌ వార్తాపత్రిక కార్యకలాపాలపై కొనసాగుతున్న మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఈ సమన్లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 7న ఢిల్లీలో ఫెడరల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజన్సీ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా ఇడి ఆదేశించింది. అక్రమ అస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో సెప్టెంబర్‌ 19న ఇడి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. చేపడుతున్న రాహుల్‌ గాంధీ చేపడుతున్న భారత్‌ జోడో యాత్ర గత వారం కర్ణాటకలో అడుగుపెట్టిన సమయంలో తాజాసమన్లు జారీ చేయడం గమనార్హం.