శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అదుపులోకి తీసుకున్నప్పటి నుండే 24 గంటల డెడ్‌‌లైన్‌..!

1 రోజు క్రితం

sc-04
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 12:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సుప్రీం రూలింగ్‌

న్యూఢిల్లీ : మేజిస్ట్రేట్‌ ముందు ఒక వ్యక్తిని హాజరుపరిచేందుకు లాంఛనంగా అరెస్టు చేసిన ప్పటి నుండి కాకుండా అదుపులోకి తీసుకున్న ప్పటి నుండే 24 గంటల డెడ్‌‌లైన్‌ ‌ప్రారంభమ వుతుందని సుప్రీం కోర్టు రూలింగ్‌ ఇచ్చింది. నిర్బంధం, అరెస్టు మధ్య వ్యత్యాసంపై జస్టిస్‌ ఉజ్జల్‌ ‌భుయాన్‌, అతుల్‌ ఎస్‌ చందుర్కా బెంచ్‌ గురువారం ఒక కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ రెండూ వ్యక్తి యొక్క ప్రాధమిక హక్కైన స్వేచ్ఛను పరిమితం చేయడానికే దారి తీస్తాయని పేర్కొంది. అక్రమ నిర్బంధాలకు చెల్లుచీటీ ఇస్తూ తీర్పునివ్వడం గమనార్హం. బెయిల్‌ ‌పొందడానికి భారీగా ఆంక్షలు వుండే యుఎపిఎ, పిఎంఎల్‌ఎ వంటి ప్రత్యేక చట్టాల్లో కంటే ప్రాధమిక హక్కులకే ప్రాధాన్యత వుంటుందని కోర్టు స్పష్టం చేసింది. మేజిస్ట్రేట్‌ ‌ముందు హాజరుపరచకుండా వ్యక్తి నిర్బంధ కాలం 24 గంటలు దాటినట్లైతే సంబంధిత వ్యక్తిని తప్పనిసరిగా వెంటనే విడుదల చేయాలి. 24 గంటల డెడ్‌‌లైన్‌కు అను గుణంగా వ్యవహరించారా లేదా అని చూసేలా తన ముందు హాజరుపరచినపుడు మేజిస్ట్రేట్‌ ‌ఆ వ్యక్తి నిర్బంధానికి సంబంధించి కచ్చితమైన తేదీ, సమయాన్ని నమోదు చేయాల్సి వుంటుంది. ‘‘విచారణ లేదా దర్యాప్తు కోసం ఒక వ్యక్తిని అరెస్టు చేయడానికి ముందు పట్టిన సమయానికి రాజ్యాంగంలోని 22(2) అధికరణ ఎలాంటి మినహాయింపును ఇవ్వడం లేదు. ఇది 22వ అధికరణలోని క్లాజు (2) పరిధికి వెలుపల వుంది. అరెస్టు చేసిన ప్రదేశం నుండి మేజిస్ట్రేట్‌ ‌కోర్టుకు ఆ వ్యక్తిని తీసుకురావడానికి పట్టే సమయానికి మాత్రమే రాజ్యాంగం మినహా యింపు కల్పిస్తోంది.’’అని జస్టిస్‌ ‌భుయాన్‌ ‌తన తీర్పులో పేర్కొన్నారు. నిర్బంధించడానికే శాంతి భద్రతలకు భంగం కలుగుతుందంటూ కుట్ర పూరితంగా పోలీసులు, ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నారని సీనియర్‌ అడ్వకేట్‌ రౌఫ్‌ రహీమ్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్