శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అయోధ్య రామమందిర ట్రస్టు తొలి సిఇఒగా జితేంద్ర మిశ్రా

2 రోజుల క్రితం

Jitendra Mishra is the first CEO of Ayodhya Ram Temple.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 11:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లక్నో : అయోధ్యలో విరాళాల చోరీతో అప్రదిష్టపాలైన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రామ మందిర ట్రస్ట్‌కు తొలి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ) గా రిటైర్డ్‌ ఎయిర్‌ మార్షల్‌ జితేంద్ర మిశ్రాను నియమించింది. బుధవారం జరిగిన ట్రస్ట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో సమయంలో వెస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌ అధిపతిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అలాగే ట్రస్ట్ నూతన ప్రధాన కార్యదర్శిగా గోవింద్ దేవ్ గిరి ఎంపికయ్యారు. మదన్మెహన్ పాండే, మహేశ్ భాగ్చంద్కా, డాక్టర్ నిర్మలా యాదవ్ కొత్త ట్రస్టీలుగా నియమితులయ్యారు. కాగా విరాళాల దుర్వినియోగ ఆరోపణల నేపథ్యంలో ఆలయ పరిపాలనను సమన్వయం చేసేందుకు విస్తృత అధికారాలతో ప్రత్యేకంగా ఈ సిఇఒ పదవిని ఏర్పాటు చేశారు. యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించడం, సమన్వయం వంటి కీలక విధులను సిఇఒ నిర్వహించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్