శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బంగారం కొనొద్దు..విదేశీ పర్యటనలు వెళ్లొద్దు

4 రోజుల క్రితం

Prime Minister Modi makes another appeal to the people of the country.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 10:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • విదేశీ పర్యటన నుంచి ప్రధాని మోడీ ఇన్‌స్టా సందేశం

న్యూఢిల్లీ : దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నాడు మరోమారు పొదుపు సూత్రాలను వల్లెవేశారు. బంగారం కొనవద్దు..విదేశీ పర్యటనలకు వెళ్లొద్దు..డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ పేరుతో విదేశాలకు వెళ్లి వివాహాలు చేసుకోవద్దు..అని ఆయన కోరారు. జెన్‌జి ఆందోళనల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో రీల్స్‌ ద్వారా సందేశాలిస్తూ వస్దున్న మోడీ ఈ పొదుపు సూత్రాలను కూడా కిర్గిస్థాన్‌ పర్యటనలో ఉంటూనే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వీడియో సందేశాన్ని పోస్టు చేయడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్- జూన్) లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదు కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని, విదేశీ ప్రయాణాలు వద్దని, అవసరం లేకుండా బంగారం కొనొద్దని మళ్లీ కోరారు. ‘దేశ ప్రజలకు అభినందనలు. 7.8 శాతం వృద్ధి గొప్ప విషయం. ప్రజల సంకల్ప బలం, కృషికి ఇది నిదర్శనం. ప్రపంచం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో భారత్ ఈ అసాధారణ ఘనతను దక్కించుకుంది. ప్రపంచం యుద్ధంలో మునిగిపోయింది. ఎటుచూసినా యుద్ధ వార్తలే.. సంక్షోభాలే. సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది. 2020లో కొవిడ్ తర్వాత నుంచి నేటి వరకు ఎక్కడా స్థిరత్వం కనిపించడం లేదు. అయినా భారత్ పురోగమిస్తోంది ” అని మోడి తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్