Apr 08,2021 23:59

అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు

అనకాపల్లి : ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా పేరుగాంచిన శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర సందర్భంగా గురువారం ఘటాల ఊరేగింపు నిర్వహించారు. మాలధారణ సేవా సంఘం స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఐదు వేల మందికి అన్నసంతర్పణ చేశారు. ఈ సందర్భంగా ఖోఖో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు దాడి జైవీర్‌, ఆలయ ఇఒ నగేష్‌ మాట్లాడుతూ ప్రతి ఏటా మాలధారణ భక్తులతో ఘటాల ఊరేగింపు, నేల వేషాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొణతాల నీలిమ, పీలా సౌజన్య, గవర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బాబ్జీ, మాలధారణ సంఘం అధ్యక్షులు పొలిమేర శ్రీను పాల్గొన్నారు.