Aug 17,2022 23:28
ఎమ్మెల్యేకు బాబూరావుకు సమస్యను చెపుతున్న వృద్దురాలు

ప్రజాశక్తి-నాతవరం:నవరత్న పథకాలు అమలు ప్రభుత్వ లక్ష్యమని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ అన్నారు. బుధవారం నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గడపగడపకు వెళ్లి సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇటువంటి సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరువు చేయడమే ముఖ్యమంత్రి ద్యే యమన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను 90 శాతం మేరకు క్యాలెండర్‌ ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్ర ప్రజలను ఆదుకున్న ఘనత జగన్‌ మోహన్‌ రెడ్డి దే అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్‌ అంకంరెడ్డి జమీల్‌, ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, జడ్పిటిసి కాపరపు అప్పలనరస, వైస్‌ ఎంపీపీ పైల సునీల్‌, మండలం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు పైల పోతురాజు మండల మహిళా అధ్యక్షురాలు కామీరెడీ లక్ష్మి, ఏఏసి ఛైర్మెన్‌ నూకరాజు, మర్రిపాలెం సర్పంచి రమణమ్మ, తహసిల్దార్‌ కనకారావు, మండల పరిపాలన అధికారి పోలుపర్తి పార్థసారథి, ఎపిఓ చిన్నారావు పాల్గొన్నారు.
పించను అందకపోవడంపై వినతి
కోటవురట్ల:గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు జగ్గంపేట, తిమ్మాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగంపేట గ్రామానికి చెందిన పైల చెన్నమ్మ వద్ధురాలు తనకు 8 నెలలుగా పెన్షన్‌ అందలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లింది. ప్రభుత్వ పాఠశాల వద్ద నిర్మించిన మురుగునీటి కాలువ నీరు నిలిచి పోవడంపై గ్రామస్తులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించాలని స్థానిక పంచాయతీ అధికారులను ఆదేశించారు. తిమ్మాపురం గ్రామంలో పది లక్షలతో నిర్మించిన అంగన్వాడి భవనాన్ని ప్రారంభించారు. జలజీవన్‌ మిషన్లో భాగంగా కోటవురట్ల, కైలాష్‌పట్నం, రాజగోపాలపురం వద్ద పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యురాలు ఉమాదేవి, మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు, మండల ఉపాధ్యక్షులు దత్తుడు రాజు, ఎంపీడీవో చంద్రశేఖర్‌, తహశీల్దార్‌ వరప్రసాద్‌, జిల్లా బీసీ సెల్‌ లో అధ్యక్షులు పైల రమేష్‌, వైసిపి సీనియర్‌ నాయకులు సిద్దాబత్తుల సత్తిబాబు పాల్గొన్నారు.