
కడప: నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం శెట్టి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్పీ కార్యాలయం ఎదురుగా తన అపార్ట్ మెంట్‌పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బంధువులు గమనించి ఆస్పత్రికి తరలించే లోపే ప్రణాం పోయిందని వైద్యులు చెబుతున్నారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందజేయనున్నారు.