Aug 08,2022 08:58

వీధిలోన వేపచెట్టు ఒకటి ఉండెను
చల్లనైన నీడ మాకు పంచుచుండెను

వేపపుల్ల దంతాలకు మెరుపునిచ్చును
వేపాకుల వలన సూక్ష్మ క్రిములు చచ్చును
వేప చిగురు తిన్న జీర్ణ శక్తి హెచ్చును
వేప బెరడుతోన ఔషధాలు చేయవచ్చును

వేపపండ్ల లోన మందులు క్షణాలు హెచ్చు
వాటిరసంతోని పుండుని నయం చేయవచ్చు
వేప పిక్కల నూనెతో చుండ్రు తరమవచ్చు
వేపపిండితోన సేంద్రియ సాగు నడుపవచ్చు

వేపమొక్కలను వీలైతే నాటి సాగవోరు
నీరుపోసి చక్కగాను పెంచి సాగవోరు

- చావలి శేషాద్రి సోమయాజులు,
సాలూరు