Oct 05,2022 12:58

ప్రజాశక్తి-కంచికచర్ల : కంచికచర్ల మండలం మోగులూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సోసైటీ భవనం, 40 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను బుధవారం కెడిసిసి బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావుతో కలిసి నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, సొసైటీ ఛైర్మన్ బండి జానకి రామయ్య, వైస్ ఎంపిపి బండి మల్లిఖార్జన్ రావు తదితరులు పాల్గొన్నారు.