Aug 07,2022 19:36

బర్మింగ్‌హామ్‌ :  భారత్‌ ఖాతాలో మరో స్వర్ణంచేరింది. ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 48-50 కేజీల విభాగంలో నార్తన్‌ ఐర్లాండ్‌కిచెందిన కార్లే మెక్‌న్యూయేపై నెగ్గి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. దీంతో భారత్‌ ఖాతాలో 17 స్వర్ణ పతకాలు చేరాయి. మొత్తం పతకాల సంఖ్య 48కి చేరింది. టాప్‌5లో భారత్‌ నాలుగో స్థానానికి చేరింది.   ఇప్పటికే బాక్సింగ్ లో నీతూ గంఘాస్,  అమిత్ పంఘల్ లు స్వర్ణ పతకాలు  గెలుచుకున్న సంగతి తెలిసిందే.