Aug 07,2022 16:18

బర్మింగ్‌హామ్‌ :  కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ ఆటగాళ్లు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా బాక్సింగ్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు దక్కాయి. ఆదివారం జరిగిన తుది పోరులో నీతు ఘన్‌ఘాస్‌, అమిత్‌ పంఘాల్‌లు తమ ప్రత్యర్థుల్ని చిత్తు చేశారు. మహిళల 48 కేజీల విభాగం ఫైనల్‌లో ఇంగ్లండ్‌కు చెందిన డెమీ-జాడే రెజ్టన్‌ను ఓడించి నీతు ఘన్‌ఘాస్‌ భారత్‌కు బాక్సింగ్‌లో తొలి పతకాన్ని అందించారు. తన పంచ్‌లతో ప్రత్యర్థిని మట్టికరిపించడంతో జడ్జీలు ఏకగ్రీవంగా నీతూను విజేతగా ప్రకటించారు. 51 కేజీల పురుషుల విభాగం ఫైనల్‌లో మరో బాక్సర్‌ అమిత్‌ పంఘల్‌ ఇంగ్లండ్‌ బాక్సర్‌ కియారన్‌ మెక్‌డొనాల్డ్‌ను అధిగమించాడు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో తన మొదటి స్వర్ణాన్సి సాధించాడు. 2018లో రజతంతో సరిపెట్టుకున్నాడు. గతంలో రెండు యూత్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్స్‌లో గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన నీతూకి ఇది తొలి సీనియర్‌ పతకం కావడం గమనార్హం. పంఘల్‌ కూడా గతంలో ఆసియా క్రీడల స్వర్ణపతకాన్ని సాధించాడు.