Aug 18,2022 11:27

న్యూఢిల్లీ : విరాట్‌ కోహ్లి. క్రికెట్‌ ఆరాధకులకు పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా నిలవడమే కాకుండా..కెప్టెన్సీలోనూ భారత్‌కు చరిత్రలో చెప్పుకోదగ్గ విజయాలను అందించారు. ఇటీవల ఫామ్‌ కోల్పోయిన కోహ్లీ.. ప్రస్తుతం కాస్త రెస్టు తీసుకుంటున్నారు. క్రికెట్‌ జాతీయ జట్టులో తిరిగి పామ్‌లోకి వచ్చేందుకు ఈ క్రికెటర్‌ తనను తాను శారీరకంగా దృఢంగా మలుచుకునేందుకు ఫిటెనెస్‌పై మరింత దృష్టి సారిస్తున్నారు. ఇటీవల తన డైట్‌, ఫిటెనెస్‌ గురించి ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు. ' కొన్ని సంవత్సరాలుగా సమయం ఉన్నప్పటికీ డైట్‌, ఫిట్‌నెస్‌పై దృష్టిసారించలేదు. ఇప్పుడు తినే విధానాన్ని మార్చాను. మరింత క్రమశిక్షణతో ఉన్నాను. నా ఆహారం గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండటానికి ప్రయత్నిస్తున్నా. షుగర్‌, గ్లూటెన్‌ వాడటం లేదు. వీలైనంత వరకు పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటాను. నా ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవడానికి 90 శాతం తింటాను. నాలాంటి భోజన ప్రియులకు ఇదంతా సులభం కాదు. కానీ రోజు చివరిరొచ్చేసరికి శరీరంలో సానుకూల మార్పులు చూసినప్పుడు.. ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచన ఓ వ్యసనంలా మారుతుంది' అని వ్యాఖ్యానించారు. డైట్‌, ఫిట్‌నెస్‌, జిమ్‌లో కసరత్తులు మిస్‌ కాకుండా చూసుకుంటున్నాని అన్నారు.