
ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన సదస్సు నిర్వహించారు. పొగాకు వాడకం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ప్రజలు ఎవరు కూడా పొగాకు సంబంధించిన బీడీ, సిగరెట్లు, గుట్కా, పాన్ లాంటివి వాడరాదు. వీటి వల్ల ఊపిరితిత్తుల కాన్సర్ వచ్చే అవకాశం వుంటుంది. అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన ఆయాసం, దగ్గు తద్వారా క్షయ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి ప్రభుత్వ కార్యాలయాల వద్ద గాని బహిరంగ ప్రదేశాల్లో గాని ధూమపానం చేయరాదు. ఈ ధూమపానం వల్ల ఆరోగ్యవంతులు జబ్బులకు గురవుతున్నారు. కాబట్టి ప్రజలు పొగాకు వాడటం వల్ల వచ్చే అనర్థాలను తెలుసుకొని వాడటం మానివేయలని తెలియచేయుచున్నామని అన్నారు.
"పొగత్రాగ వద్దు... కాన్సర్ వ్యాధికి గురి కావద్దు" మత్తు పదార్థాలు వాడొద్దు అనారోగ్యానికి గురి కావద్దు. ధూమపానం మానడం వలన గుండె జబ్బులు రావు మరియు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఈ కార్యక్రమంలో వైద్యులు దయాకర్, సబీహా సుల్తానా, ఎంపీహెచ్ ఈ ఓ లు నాగేశ్వరయ్య, మునాఫ్, పీహెచ్ ఎన్ తులసమ్మ, సూపర్ వైజరు వెంకటరత్నమ్మ,ఓ.పి సిబ్బంది, ఏఎన్ ఎమ్ లు,మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు