
- జిఒఎంఎస్ నెంబరు 3 విడుదల
- మే 1 నుంచి పే స్కేలు అమలు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : 2020 సంవత్సరంలో రెండో విడతలో ఎంపికైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కాలానిు డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి జిఓ ఎంఎస్ నెంబరు 3ను సోమవారం ప్రభుత్వం విడుదల చేసింది. ప్రొబేషన్ డిక్లేర్‌తో సుమారు 17 వేలమంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు లబ్ధిచేకూరనుంది. వారికి 2023 మే 1 నుంచి పే స్కేలు వర్తించనుంది. అర్హులైన అభ్యర్థులు గ్రామ, వార్డు సెక్రటేరియట్ కార్యనిర్వాహకుల పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ సంబంధిత మాతృశాఖల ద్వారా నోటిఫికేషన్‌లు జారీ చేశారు. ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల కాలం రూ.15 వేల వేతనానికి విధులు నిర్వహించారు. మాతృశాఖలైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, రెవెన్యూ, వ్యవసాయం, సహకారం, పశు సంవర్థకశాఖ, డెయిరీ డెవలప్‌మెంట్ అండ్ ఫిషరీష్, హోమ్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్టుమెంట్ల కింద పరీక్షలు నిర్వహించినట్లు జిఓలో స్పష్టం చేశారు.