Jan 28,2023 21:10

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని దిగ్గజ విద్యుత్‌ కంపెనీ ఎన్‌టిపిసి 2022ా23 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 5శాతం వృద్థితో రూ.4,854.36 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.4,626.11 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.33,783.62 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ3లో ఇది రూ.44,989.21 కోట్లకు చేరింది. మధ్యంతర డివిడెండ్‌ కింద రూ.10 ముఖ విలువ కలిగిన షేర్‌పై రూ.4.25 లేదా 42.50 శాతం కేటాయించడానికి బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు మద్దతును తెలిపారు. 2022 డిసెంబర్‌ ముగింపు నాటికి రోజుకు 78.64 బిలియన్‌ యూనిట్లను ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.