Nov 24,2021 22:06

ఇండియన్‌ సూపర్‌లీగ్‌లో బెంగళూరుపై గెలుపు
గోవా: ఇండియన్‌ సూపర్‌లీగ్‌(ఐఎస్‌ఎల్‌)లో ఒడిషా జట్టు సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన పోటీలో ఒడిషా జట్టు 3-1 గోల్స్‌ తేడాతో బెంగళూరు ఎఫ్‌సిని చిత్తుచేసింది. ఒడిషా తరఫున హెర్మాండెజ్‌ 3, 51వ ని.లో గోల్స్‌ కొట్టగా.. బెంగళూరు తరఫున ఏకైక గోల్‌ను అలెన్‌ కోస్టా 21వ ని.లో కొట్టాడు. ఇరుజట్లు తొలి అర్ధభాగంలో ఒక్కో గోల్‌ నమోదు చేయగా.. రెండో అర్ధభాగంలో ఒడిషా మరో గోల్‌ను నమోదు చేయగా.. బెంగళూరుకు రెండో అర్ధభాగం కలిసిరాలేదు.
ఐఎస్‌ఎల్‌లో నేడు..
నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ × కేరళ బ్లాస్టర్స్‌
వేదిక: గోవా రా.7.30గం|7.30ల నుంచి