Aug 18,2022 21:13

న్యూఢిల్లీ  :   అంతర్జాతీయ చమురు ధరలు ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అయినా భారత మార్కెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మండుతూనే ఉన్నాయి. ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరల  ఆధారంగా భారీగా పెంచిన కేంద్ర ప్రభుత్వం.. తిరిగి అదే క్రమంలో తగ్గినప్పుడు మాత్రం ఆ ఫలితాలను ప్రజలకు అందించకపోవడం గమనార్హం.  అంతర్జాతీయ మాంద్యం నేపథ్యంలో గురువారం బ్యారెల్‌ చమురు ధర 94.91 డాలర్లకు తగ్గింది. ఇది ఆరు నెలల కనిష్ట స్థాయి. దాదాపుగా 85 శాతం చమురు దిగుమతులపై ఆధారపడుతున్న భారత్‌కు చాలా ఉపశమనం. ఇంత తగ్గినప్పటికీ తమకు నష్టాలు వస్తున్నాయని కొన్ని చమురు కంపెనీలు ఆందోళన వ్యక్తం చేయడం విశేషం.  పెట్రోలుపై ఇప్పుడు ఎకరలాంటి అండర్‌ రికవరీ (నష్టాలు) లేవని, డీజిల్‌కు సంబంధించి ఆ స్థాయికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుందని ఓ అధికారి తెలిపారు. కాగా.. గత ఐదు నెలల్లో తక్కువ ధరకు ఇంధనాన్ని విక్రయించడం ద్వారా చమురు కంపెనీల నష్టాలను తిరిగి రికవరీకి అనుమతించబడుతుండటంతో తక్షణమే ధరలను తగ్గించే అవకాశం లేదని మరో అధికారి తెలిపారు.