
- ఇండిస్టియల్ కారిడార్‌గా తిరుపతి
- పలు పరిశ్రమలకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేసిన సిఎం
ప్రజాశక్తి-తిరుపతి బ్యూరో, శ్రీకాళహస్తి : రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల ద్వారా వస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మహిళలకు పెద్దపీట వేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. మంత్రులు పెద్దిరెడ్డి, అమర్నాథ్లతో కలిసి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతంలో పలు పరిశ్రమలకు గురువారం ఆయన భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ అపాచీ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో అపాచీ మూడో శాఖను ఇక్కడ ఏర్పాటు చేస్తునుందుకు అభినందనలు తెలిపారు. అనంతరం అపాచీ (పాదరక్షలు-అడిడాస్ షూస్) పరిశ్రమకు భూమి పూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ త్వరలో తిరుపతి జిల్లా పూర్తిస్థాయి ఇండిస్టియల్ కారిడార్‌గా రూపుదిద్దుకోనుందనీ చెప్పారు. ఆ దిశలో తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తడ వద్ద అపాచీ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేశారన్నారు. తద్వారా ప్రత్యక్షంగా 15 వేల మందికి ఉపాధి లభిస్తోందని చెప్పారు. అందులో 80 శాతం మంది మహిళలే ఉపాధి పొందుతుండడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న మిగిలిన పరిశ్రమల్లో కూడా అదే విధంగా మహిళలకు అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇటీవల పులివెందులలో అపాచీ రెండో పరిశ్రమకు శంకుస్థాపన చేశామని, తద్వారా రెండు వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. తాజాగా ఇనగలూరు వద్ద రూ.800 కోట్లతో అపాచీ మూడో పరిశ్రమకు భూమి పూజ జరిగిందన్నారు. ఈ పరిశ్రమ ప్రారంభమైతే ప్రత్యక్షంగా పది వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని తెలిపారు. 2023 సెప్టెంబర్ నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి అవుతాయని తెలిపారు. గడువులోగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అపాచి ప్రతినిధులను కోరారు. అనంతరం ఏర్పేడు మండలం వికృతమాల వద్ద నెలకొల్పిన టిసిఎల్ కంపెనీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కంపెనీకి చెందిన ప్యానల్ అప్టోడిస్ప్లే టెక్నాలజీ లిమిటెడ్ ద్వారా రూ.1,200 కోట్లతో ప్యానల్ అప్టోడిస్ప్లే తయారీ యూనిట్‌ను, ఎలక్ట్రానిక్ మ్యానుప్యాక్చరింగ్ క్లస్టర్ ఇఎంసి-1, ఇఎంసి-2, డిక్సన్ టెక్నాలజీస్, ఫాక్స్‌లింక్ ఉత్పత్తులను ప్రారంభించారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహికులకు అన్ని రకాల సదుపాయాలు, సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపి గురుమూర్తి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- వైభవంగా వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ
తిరుపతికి సమీపంలోని పాతకాల్వ (పేరూరు బండ) వద్ద నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ గురువారం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకును ఆయనకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం టిటిడి అధికారిక వృక్షం మానుసంపంగి మొక్కనిఆలయం వద్ద ముఖ్యమంత్రి నాటారు.