
న్యూఢిల్లీ : అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) వేయాలంటూ ప్రతిపక్షాలు సోమవారం భారీ ప్రదర్శన చేపట్టాయి. అలాగే రాహుల్‌పై అనర్హత వేటుని కూడా వ్యతిరేకించాయి. ప్రతిపక్ష నేతలంతా ఐక్యంగా నల్లదుస్తులు ధరించి పార్లమెంటు నుండి విజయ్ చౌక్ వైపుగా పాదయాత్ర చేపట్టారు. అనంతరం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఇతర ప్రతిపక్ష నేతలు ఈ నిరసనలో పాల్గొన్నారు. 'సత్యమేవ జయతే' అని రాసి వున్న బ్యానర్‌తో పాటు జెపిసి వేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.