Jan 19,2022 16:12

ప్రజాశక్తి - ఆలమూరు :ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి వన్‌ టైం సెటిల్మెంట్‌ నిరుపేదల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, దీని ద్వారా అర్హులైన లబ్ధిదారులకు శాశ్వత గృహ హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకోనెలా చర్యలు తీసుకోవాలని ఎంపిపి తోరాటి లక్ష్మణరావు, ఎంపిడిఒ జె.ఏ.ఝాన్సీ తాహశీల్దార్‌ జి.లక్ష్మీపతిలు పేర్కొన్నారు. ఈ నెల 22న జరగనున్న మెగా ఓటీఎస్‌ మేళపై మండల పరిషత్‌ కార్యాలయంలో కార్యదర్శులకు, వీఆర్వోలకు, సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించేందుకు బుధవారం వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారునికి సంక్షేమ ఫలాలు అందివ్వాలనే సదుద్దేశ్యంతోనే ఈ మెగా క్యాంపు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఓటీఎస్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా లబ్ధిదారులకు వివరించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ ఏఈ జేజిబాబు, ఏపిఎం విశ్వనాదం, కార్యదర్శులు విఆర్వోలు పాల్గొన్నారు.