Jan 14,2022 20:00

శ్రీ విష్ణుహీరోగా దర్శకుడు తేజమర్రి రూపొందించిన చిత్రం 'అర్జున ఫల్గుణ'. ఇటీవల థియేటర్లలో విడుదలైంది. త్వరలోనే ఓటీటీ లో విడుదలైయ్యేందుకు సిద్ధమైంది. ఆహాలో జనవరి 26 నుంచి స్ట్రీమింగ్‌ కానుందనిచిత్రబృందం తెలిపింది. గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే కథ. హీరోయిన్‌గా అమృతా అయ్యర్‌ నటించింది. నరేష్‌, శివాజీరాజా, సుబ్బరాజు, రంగస్థలం మహేష్‌ కీలక పాత్రలు పోషించారు. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ నిర్మించిన ఈ చిత్రానికి బాలసుబ్రహ్మణ్యన్‌ సంగీతం అందించారు.