Oct 13,2021 18:21

శర్వానంద్‌, సిద్ధార్థ్‌, అను ఇమ్మాన్యుయేల్‌, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'మహా సముద్రం'. జగపతి బాబు, కెజిఎఫ్‌ రామచంద్ర రాజు, రావు రమేష్‌ కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళంలో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని అజరు భూపతి తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్‌ అండ్‌ రొమాంటిక్‌ డ్రామా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు కొనుగోలు చేసింది. 'మహా సముద్రం' థియేటర్‌లో విడుదలైన రెండు వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వస్తుంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మించిన 'మహా సముద్రం' సినిమాకి చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం అక్టోబర్‌ 14న దసరా కానుకగా థియేటర్లలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది.