అవార్డు అందుకుంటున్న సబ్‌కలెక్టర్
ప్రజాశక్తి-పెనుకొండ :ఓటరు నమోదు ఉత్తమ అధికారిగా పెనుకొండ సబ్ కలెక్టర్ ఎం. నవీన్ అవార్డు అందుకున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం వెలగపూడిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేతుల మీదుగా ఉత్తమ ఓటరు నమోదు అధికారిగా సబ్ కలెక్టరు నవీన్ అవార్డును అందుకున్నారు. ఉత్తమ అధికారిగా నవీన్‌కు అవార్డు రావటం పట్ల స్థానిక అధికారులు హర్షం వ్యక్తం చేశారు,