
ప్రజాశక్తి -అమలాపురం
స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కళాశాల్లో సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకే షన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రొగ్రామ్ కింద కార్యకలాపాలైన ఎన్నికల జాబితాలో పేరు నమోదు, ఓటు హక్కు విశిష్టత గురించి విద్యార్థుల కు బుధవారం అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఓటర్గా నమోదుకు అర్హత తేదీ 2023 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండుతున్న ప్రతి ఒక్కరు ఓటర్ గా నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఆర్డిఒ ఎన్ఎస్విబి. వసంతరాయుడు, మున్సిపల్ కమిషనర్ విఐపి నాయుడు స్థానిక తహశీల్దార్ పి.శ్రీ పల్లవి, కళాశాల ప్రిన్సిపల్ మనోహర్, కళాశాల కరస్పాండెంట్ నరసింహా రావు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.