May 12,2022 12:51

ప్రజాశక్తి-పాలకొల్లు: అంతర్జాతీయ నర్సింగ్ డే' పురస్కరించుకొని పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో హాస్పిటల్ కమిటీ సభ్యులు డా.చినిమిల్లి గణపతి, చెన్ను విజయ్ అధ్వర్యంలో నర్సింగ్ డే  ఘనంగా నిర్వహించారు. నర్సింగ్ సూపరింటెండెంట్ విజయకుమారిని, హెడ్ నర్సెస్ నాగలక్ష్మి,సుజాత, పాతిభాబి లను దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు. గణపతి మాట్లాడుతూ ఈ రోజు ఫ్లారెన్స్ నైటింగ్యేలు 202వ జయంతి అని నర్సింగ్ వ్యవస్థకు ప్రపంచములోనే అత్యంత గుర్తింపు ఉందన్నారు. ఇంకా ఎక్స్ రే టెక్నీషియన్ రవికుమార్, లక్ష్మణ్, నర్సింగ్ స్టాఫ్ బి. గంగా మహాలక్ష్మి,M. చిత్ర, వెంకటేశ్వరి, బి. మేరీ,K మధులత, గవర సునీత, సరస్వతి, ధనలక్ష్మి  పాల్గొన్నారు.