May 14,2022 15:59

ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లు రూరల్ సర్కిల్ ఇన్స్పక్టర్ గా కొండవీటి శ్రీనివాస కుమార్ భాద్యతలు చేపట్టారు. ఆయన 2007 బ్యాచ్ కి చెందిన వారు. మొదటిగా ప.గో జిల్లా నరసాపురం స్టేషన్ కి ప్రోహిబిషన్ ఎస్సైగా విధులు నిర్వర్తించారు. బదిలీల క్రమంలో భీమవరం, తణుకు, ఇరగవరం, పలు స్టేషన్లలో ఎస్సై గా చేసి పదోన్నతిపై సీఐడీలో విధులు నిర్వహించి నేడు పాలకొల్లు రూరల్  సీఐగా బదిలీపై వచ్చారు. ఆయన ఛాంబర్ లో పాలకొల్లు రూరల్ ఎస్సై శ్రీనివాస్,పోడూరు ఎస్సై ,యలమంచిలి ఎస్సై, ఆచంట ఎస్సై, వీరవాసరం ఎస్సైలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.