May 16,2022 11:03

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లులో సోమవారం వాతావరణం అకస్మాత్తుగా మారి వర్షం కురిసింది. కొన్ని చోట్ల వివాహ వేడుకలకు ఇబ్బంది కలిగింది. నియోజకవర్గంలో రబీ పంట కోతకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే తుఫాన్‌ ప్రభావంతో ఈదురుగాలులకు పంట ఒరిగి దిగుబడి తగ్గుతోందని, ఇపుడు తిరిగి వర్షం కురవడంతో పంట నష్టపోతామేమోనంటూ రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.