Oct 19,2021 06:42

విరిసే చేతులు
విరిగి పోతున్నాయి
మొలిపించే పాదాలు
నలిగి పోతున్నాయి
అన్నం పెట్టేవాళ్ళు
మాంసం ముద్దై పోతున్నారు
ప్రశ్నించే గొంతులు
అమాంతంగా మూగ పోతున్నాయి
పాల పిట్ట వస్తుందని
దాని దర్శనంతో
విజయాన్నేదో మోసుకొస్తుందని
గంపెడాశ ఎదురు చూపులకు
మత్తెక్కిన అధికార గర్వం
మృత్యు శకటమై
నడిరోడ్డు మీద
రక్తమోడిన విషాదమే చేరింది
పాల పిట్ట రానేలేదు
కర్షక కన్నీళ్లు
తొంగి చూడనే లేదు
అదీ పాలకపక్షం చేరిపోయిందా!?
కార్పొరేట్‌ కూత కూస్తోందా!?
 

- చిలుకూరి శ్రీనివాసరావు,
కడియం.