Oct 14,2021 21:52

నిత్యావసర సరుకులు అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-అనంతపురం  మేజర్‌ పంచాయతీ ఎ.నారాయణపురంలో పనిచేస్తున్న 70 మంది పారిశుధ్య కార్మికులకు దసరా పండుగను పురస్కరించుకుని దక్ష కన్‌స్ట్రక్షన్స్‌ ఆధ్వర్యంలో గురువారం నిత్యవసర వస్తువులు, దుస్తులు పంపిణీ చేశారు. పంచాయతీ పరిధిలో ఉన్న రైతుభరోసా కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి పార్వతి, రూరల్‌ ఎంపీపీ లక్ష్మీదేవి ముఖ్య అతిథులుగా హాజరై కార్మికులకు సరుకులు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయంలో పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివని, పండుగను పురస్కరించుకుని వారికి నిత్యావసర వస్తువులు, దుస్తులు అందించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగేంద్ర, మాజీ సర్పంచి జగన్మోహన్‌ రెడ్డి, సీనియర్‌ వైసిపి నాయకులు ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి హాజరై కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
మున్సిపల్‌ కార్మికులకు దుస్తులు పంపిణీ
దసరా పండుగను పురస్కరించుకుని నగరంలోని 16వ డివిజన్‌ వైసిపి కన్వీనర్‌ సురేశ్‌ సాయంతో మున్సిపల్‌ కార్మికులకు దుస్తులను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, వైసిపి సీనియర్‌ నాయకులు అనంత చంద్రారెడ్డిలు గురువారం పంపిణీ చేశారు. అనంతరం 3వ రోడ్డులో నగర పాలక సంస్థ కో- ఆప్షన్‌ సభ్యులు లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు పంపిణీ కార్యక్రమంలోనూ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌ రెడ్డి, వాసంతి సాహిత్య, వైసీపీ నాయకులు మదన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.