Jun 23,2021 15:43

నందిగామ (కృష్ణా) : నందిగామ పట్టణంలోని 10, 20వ వార్డులలో పలు ఏరియాలలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మండవ వరలక్ష్మి మంగళవారం నాడు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నందిగామ పట్టణ పరిధిలోని పారిశుధ్య పనులను మెరుగు పర్చాలని కోరారు. డ్రైనేజీలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో వెంటనే పారిశుధ్య సిబ్బందితో క్లీన్‌ చేయించి మురుగునీరు పారే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వార్డులలో హైపో క్లోరైడ్‌ పిచికారి చేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని, మురుగునీరు పోయే విధంగా పూడిక తీసి బ్లీచింగ్‌ చల్లాలని, చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మంచినీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ జయరాం, వైయస్సార్‌సిపి నాయకులు మండవ పిచ్చయ్య, కోలేటి సుబ్బారావు, శ్రీను, కర్రి రవీంద్ర, మున్సిపల్‌ ఇంజనీర్‌ ఫణి శ్రీనివాస్‌, శానిటరీ ఇన్స్పెక్టర్‌ శివ ప్రసాద్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సచివాలయం సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.