
ప్రజాశక్తి-కొత్తవలస : సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులే పార్టీ రథ సారధులని వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, విశాఖ ఎంపి ఎమ్‌వివి సత్యనారాయణ హాజరయ్యారు. ఈసందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు ముఖ్యమంత్రి ఆలోచనలను, ఆశయాలను ప్రజలకు వివరించాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదో చూడాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకులు తైనాల విజయకుమార్, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు,రాష్ట్ర బి.సి కొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, జిసిసి చైర్మన్ శోభా స్వాతిరాణి, శోభా హైమావతి, డిసిసిబి చైర్మన్ వేచలపు వేంకట చినరామునాయుడు , పార్టీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాధం, ఎఎంసిి చైర్మన్ మూకల కస్తూరి పాల్గొన్నారు.
పూసపాటిరేగ : సంక్షేమ పథకాలపై వాలంటీర్లతో పాటు, గృహ సారధులు, కన్వీనర్లు వివరించాలని వైసిపి జిల్లా రీజినల్ కో-ఆర్డినటర్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని సిహెచ్ అగ్రహారం లేఅవుట్‌లో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అధ్యక్షతన పూసపాటిరేగ మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా గృహసారధులకు, కన్వీనర్లకు కిట్లు అందజేసారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పధకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారా? లేదా? తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారన్నారు. గృహ సారదులతో పాటు కన్వీనర్లు ఇంటింటికి వెల్లి
జగనన్న సంక్షేమం గురించి వివరించాలన్నారు. వారు సంతృప్తి చెందితే వారి ఇంటికి జగనన్న స్టిక్కర్ అంటించాలన్నారు. జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనువాసరావు, ఎమ్మెల్యే బడ్డుకొండ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్ బాబు, ఇందుకూరి రఘురాజు, నియోజకవర్గ పరిశీలకులు అందవరపు సూరిబాబు, నాయకులు కందుల రఘుబాబు, కాకర్లపూడి శ్రీనుబాబు, ఎంపిపిలు మహంతి కళ్యాణి, అంబళ్ళ సుధారాణి, మహంతి జనార్దన్, పుప్పాల లక్ష్మీనారాయణ, పార్టీ అధ్యక్షలు పతివాడ అప్పలనాయుడు, చనమల్ల రమణ, చిక్కాల సాంబ, ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, జెడ్‌పిటిసిలు పడాల మంజులత, గదల సన్యాసి నాయుడు, సౌత్ రైల్వే బోర్డ్ సలహా మండలి సభ్యులు అంబళ్ళ శ్రీరాములనాయుడు, మత్స సత్యనారాయణ, కెవి.సూర్యనారాయణరాజు, మండల కన్వీనర్ మహంతి శ్రీనువాసరావు పాల్గొన్నారు.
విజయనగరం టౌన్ : ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల చెంతకు తీసుకెళ్లాలని ఉత్తరాంధ్ర జెసిఎస్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సుజాత కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గృహ సారధులు, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్ల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామితో పాటు ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు అందిస్తున్న ఘనత వైసిపి ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రభుత్వ పాలనపట్ల ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేయలేక వాలంటీర్ వ్యవస్థను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో గృహ సారధులు, సచివాలయ కన్వీనర్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్లు చెప్పారు. కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనా తీరును, ప్రస్తుత ప్రభుత్వ పాలన తీరును వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో గృహ సారధుల మండల కమిటీ అధ్యక్షుడు మజ్జి అప్పారావు, ఎంపిపి మామిడి అప్పలనాయుడు, ఎఎంసిమాజీ చైర్మన్ నడిపేన శ్రీనివాసరావు, వైస్ ఎంపిపి నారాయణ, కెల్ల త్రినాథ్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.