
ప్రజాశక్తి - నిడమర్రు
భువనపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు రూ.లక్ష విలువైన 25 బెంచీలను విరాళంగా అందించిన సంకు పుల్లయ్యను పాఠశాల తరపున ఎంఎల్‌ఎ సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిడమర్రు ఎంపిడిఒ ప్రకాష్, ఎంపిపి ధనుకొండ ఆదిలక్ష్మి, సుబ్రహ్మణ్యం, ప్రధానోపాధ్యాయులు సిరమామిళ్ల పెద్దిరాజు, ఎంపిటిసి సభ్యులు, వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.