Sep 14,2021 21:34

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చెరువులపై ఆధారపడి జీవించే వారిని ఆర్థికంగా పైకి తీసుకురావాలని నెలకు కనీసం రూ.15 వేలు ఆదాయం లభించేలా నెల్లూరు జిల్లాలో చెరువుల సాగుపై జిఓ తెస్తే... దానిపై టిడిపి విష ప్రచారం చేస్తోందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మత్స్యకారుల ద్వారా చెరువుల నిర్వహణ చేపట్టామని తెలిపారు. వందెకరాలకు పైబడిన చెరువులను నెల్లూరులో ఎంపిక చేసి, వారికి కనీసం రూ.15 వేల ఆదాయం వచ్చేలా పైలెట్‌ ప్రాజెక్టు చేపట్టేందుకు జిఓ 217 తీసుకొచ్చామని పేర్కొనాురు. ఈ జిఓ కింద 28 చెరువులను తీసుకొచ్చామన్నారు. ఇది నెల్లూరు జిల్లాకుమాత్రమే అనిజిఓలో స్పష్టంగా ఉన్నా... రాష్ట్రం మొత్తం అమలు చేస్తున్నారని టిడిపి అనడం సమంజసం కాదన్నారు. నెల్లూరులో మంచి ఫలితాలు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని ఆలోచించాలని భావించినట్లు చెప్పారు.